ఈ భావాలు ర‌చ‌యిత చెప్పాల‌ని చెప్పి ఉండ‌వ‌చ్చు. అలా కాక‌నూపోవ‌చ్చు. మ‌హాక‌వుల మాట‌ల‌ను అర్థాలు అనుస‌రిస్తాయ‌న్న‌ట్లుగా హృద‌య సంస్కారం ఉన్న వారి ర‌చ‌న‌లు ఉత్త‌మార్థ ప్ర‌తిపాదికాలు కాకమాన‌వు.

భోగీర‌లోయ‌, బొమ్మ‌ల‌రాణి, వీణ‌, సంధ్యానృత్య‌ము, ఈ క‌థ‌ల‌లో శిల్ప‌, సంగీత‌, నృత్య క‌ళ‌లు ప్రధాన పాత్ర వ‌హిస్తాయి. ఈ క‌ళ‌ల ద్వారా, ప‌ర‌మౌన్న‌త్య భావ‌న‌లో ప‌ర‌మానంద‌మ‌నుభవించ‌డ‌మే మాన‌వ జ‌న్మ‌మెత్తినందుకు ఉత్త‌మ ఫ‌లం అంటారు, ర‌చ‌యిత ఈ క‌ధ‌ల‌లో ఈ క‌ళ‌ల‌ను గురించి స్ప‌ష్టంగా వివ‌రించ‌డం జ‌రిగింది. ర‌చ‌యిత కూడా ఈ క‌ళ‌ల‌తో ప‌రిచ‌యం గ‌ల‌వాడ‌వ‌టంచేత‌నూ క‌ళ‌ల‌ను చూసి స్పందించే హృద‌యం ఉండ‌డ‌టం చేత‌నూ క‌థ‌నం ర‌స‌వంతంగా ఉంటుంది.

భోగీర‌లోయ లోని నాయ‌కుడు జోత్స్నా ప్రియుడూ నాయిక క‌ల్హార మాలికా ఎవ‌రికి సంబంధించి గాధ‌ను వారు ఉత్త‌మ పురుష‌లో మ‌న‌కు వినిపిస్తారు.ఇందువ‌ల‌న ఇరువురి హృద‌య గ‌తాభిప్రాయాల‌నూ విని తీర్పు చెప్పాల్సి వారు ప‌ఠిత‌ల‌వుతారు.

క‌ల్హార‌మాలిక ఆనంద‌వ‌సుడ‌నే మాళ‌వ మంత్రి త‌న‌య‌. చిత్ర‌లేఖ‌నంలో చాతుర్యం అల‌వ‌ర్చుకొన్న‌ది. కానీ ఆమె విద్య ప‌రిపూర్ణ స్థాయికి చేరుకోలేక‌పోయింది. స‌రైన గురువుకోసం అన్వేషించ‌గా జ్యోత్సాప్రియాచార్యుల చిత్ర‌లేఖ‌న కౌశ‌ల్యాన్నీ, కీర్తినీ విని అత‌ని శుశ్రూష‌చేసి విద్య న‌భ్య‌సించాల‌న్న త‌లంపుతో భోగీర‌లోయ‌లో నిర్మిత‌మైన మ‌హా చైత్యానికి వ‌స్తుంది. కానీ ఆచార్యుడు మాత్రం ఆమెను శిష్యురాలిగా స్వీక‌రిచండానికి అంగీక‌రించ‌క‌పోగా ప‌రుషంగా మాట్లాడి నొప్పిస్తాడు. ఇందుకు కార‌ణం అత‌డు ఇక్ష్వాకు రాజ‌క‌న్య‌ను ప్రేమిస్తున్నాన‌ని చెప్పి మోస‌గించ‌డ‌మే. ఇంత‌టితో ఇత‌ను స్త్రీ ద్వేషిగా మారిపోతాడు. స్త్రీ పిశాచం అని అన‌డానికి కూడా వెర‌వ‌డు. క‌ల్హార‌మాలిక ఈత‌ని తిర‌స్కారానికి త‌ట్టుకోలేక కుమిలిపోతుంది. పురుషుని ఉత్త‌మ శ‌క్తిని పైకి విజృంభింప స్త్రీయున్నూ, చేయ‌డానికి స్త్రీ యొక్క ప‌విత్ర శ‌క్తిని తేజ‌రిల్ల చేయ‌డానికి పురుషుడున్నూ ఉద్భ‌వించాడు. అని వృద్ధుడైన స‌త్య‌శీల భిక్షాచార్యులు బోధ చేస్తాడు.

ఆమెకి జ్యోత్స్నాప్రియుడు క‌ల్హార‌మాలిక‌కు చిత్ర‌లేఖ‌నం నేర్పించ‌డానికి అంగీక‌రిస్తారు. కాని కొన్ని నియ‌మాలు పెడ‌తాడు. తాను నేర్పుతూంటే వెన‌క‌నుంచి నేర్చుకోవాలి ! ఎదుట‌బ‌డ‌రాదు. చిత్రం గీసిన త‌రువాత సేవ‌కుల‌చేత పంపించాలి గాని తాను స్వ‌యంగా ప‌ట్టుకొని రారాదు. ఇంత‌గా అత‌ను నారీజ‌న దూరుడైనాడు. స్త్రీని చూచినంత మాత్రం చేత అత‌నినిగ్ర‌హం స‌డ‌లిపోతుందిగాని తాను బ‌ల‌హీన మ‌న‌స్కుడ‌న‌ని గాని అత‌డ‌నుకొని ఇలా చేయ‌లేదు. ఇక్ష్వాకు రాజ‌క‌న్య అత‌నిలో రేపిన దెంత గాయ‌మూ, అత‌డు పూనిన దృడ‌దీక్ష‌వ‌ల్ల తెల్ల‌మౌతుంది. ఆమె క‌త‌డు చిత్ర‌లేఖ‌నం నేర్పితే చాలు. ఆమె ఎన్ని నియ‌మాల‌నైనా పాటించ‌గ‌ల‌దు. అంత‌టి వేర్రి వ్యామోహంతో ఆమె చిత్ర‌విద్య నేర్చుకొన‌సాగింది. పూవు మ‌ధువును త‌న‌లో నింపుకొన‌డం ఎంత స‌హ‌జ‌మో, మీట‌క‌పోయినా వీణ మున్న‌గు జంత్రాల తీగ‌ల‌లో స‌ప్త‌స్వ‌రాలు ఎలా గుప్త‌మై ఉంటాయో, అంత సహ‌జంగానూ త‌న‌లో శిల్ప‌విద్య హ‌త్తుకుపోవాల‌ని ఆ బాల కాంక్షించింది.

ఆమె శిల్ప త‌ప‌స్సు, దీక్ష జ్యోత్స్నా ప్రియునిలో ఒక క‌దలిక‌ను రేపింది. అయినా స్త్రీ హృద‌యంలో విషం దాచుకొంటుంద‌నుకుంటారు. స్త్రీ మార‌పిశాచి అనుకొంటాడు. అస‌లీ స్త్రీని ఎందుకు సృష్టించాడో ఈ దేవుడు, అని వారి ఉనికినే భ‌రించ‌లేడు. క‌ల్హార‌మాలిక ర‌చించే చిత్రాల‌లోని ప్ర‌జ్ఞ‌ను గుర్తించినప్ప‌టికీ ఆమెపైనున్న ద్వేషం క‌ర‌గ‌దు ఆమెను తిట్టుకుంటూ హేళ‌న చేసుకుంటూనియినా, ఆమెను గురించి ఆలోచించ‌డం మాన‌డు. ఈ స‌మ‌యంలోనే ఆమె సౌంద‌ర్యంపై కూడా దృష్టి మ‌ళ్ళుతుంది. ఛీ ! ఈ స్త్రీ నామంపిశాచాన్నెందుకుత‌ల‌పోసుకుంటున్నానో అనుకుంటాడు. ఇలా ద్వేషంతో ఆమెను గూర్చి త‌ల‌బోసుకున్నా మ‌న‌సులో అనుక్ష‌ణం ఆమె మెదిలేది. క‌ల్హార‌మాలిక మొద‌టినుండీ అత‌డంటే అభిమాన‌మే, ఆత్మార్ప‌ణ‌మే.

ఒక‌నాడామె చిత్రాన్ని దిద్ద‌టానికి వారి విహారానికి వ‌చ్చిన‌ప్పుడు తాను చిత్రించిన బోధ‌స‌త్వుని విగ్ర‌హం చెంత ఎవ‌రో ఒక బాలికామూర్తిని చిత్రించార‌ని ఆగ్ర‌హిస్తాడు. ఆ చిత్రించిన‌దేమూర్ఖుడో అని న‌రిసిస్తాడు. ఇంత‌లో ఆమె చిత్రం ప్రాణ‌వంత‌మైన స్త్రీ మూర్తి అని తెలిసి, విస్మ‌యంచెంది, నీవు దేవ‌బాలిక‌వా ! అంటాడు. ఆమె సౌంద‌ర్యం అత‌న్ని చ‌లింప‌వేసినందుకు దుఃఖిస్తాడు. మ‌ళ్ళీ త‌న‌మీద విష‌ప్ర‌యోగం జ‌రుగ‌బోతుంద‌నుకుంటాడు. ఇంద్రుణ్ణి వెంటాడే బ్రహ్మ‌హ‌త్యాపాత‌క‌కులా ఆమె త‌న‌కుగోచిరించి భ‌య‌కంపితుడౌతాడు.

స‌త్య‌శ్రీ భిక్షాచార్యుడు త‌న చిత్రాల‌లో శిల్పాల‌లో క‌రుణ‌లోపించింద‌ని చెప్పేస‌రికి, ప‌రిపూర్ణ క‌రుణామూర్తియైన బుద్ధుడికి తాను చేసే పూజ‌లో కొర‌త ఉంద‌నుకొని త‌న స్త్రీ ద్వేషాన్ని నిర్మూలం చేసికొంటాడు. క్ర‌మంగా, అత‌డామెకి స‌ర్వ‌స్వం కాలిగిన శాంత‌మూర్తిని చేయ‌గ‌ల్గింది. అత‌నిలో మ‌హాజ్వాల చ‌ల్లార‌డ‌మే కాదు, ఆ తావులో అమృతం ఊట‌లూరుతుంది.

ఈ గాథ‌లో స్త్రీ శ‌క్తిని, రెండు విధాలుగా వ‌ర్ణించారు. ర‌చ‌యిత ఒకామె పురుషునితో అంతులేని అశాంతిని, కక్ష‌నీ, మంట‌ల‌నీ రేపి ప్ర‌ళ‌యం సృష్టిస్తుంది. ఇంకొకామె అత‌నిలో ప‌రిపూర్ణ‌మైన క‌రుణ‌నీ, శాంతినీ, సుఖ‌, సంతోష‌, ఆనందాల‌నీ, ప్ర‌ణ‌యాన్నీ జ‌నింప చేయ‌డ‌మేకాదు, ఒక మ‌హనీయ పురుష‌మూర్తిని స‌మాజాని క‌ర్పించ‌గ‌ల్గింది.

ఈ క‌థ‌లో తుమ్మెద ఝంకారాలూ, ప‌క్షుల క‌ల‌కూజితాలూ, పారిజాత‌వ‌నాలూ, అడ‌వి మ‌ల్లెల‌తో ప్ర‌కృతిలోని అందాల‌న్నీ మాల‌గా ధ‌రించిన రాగ‌మాలిక‌లు పాడుకుంటూ ప‌రుగులెత్తే భోగీర‌న‌దీ సౌంద‌ర్య త‌ళ‌త‌ళ‌, గుహ‌ల‌లో చెక్కిన శిల్ప చిత్ర‌కాళా వైభ‌వ‌మూ, మ‌హాభిఖ్ఖుం మంత్ర ప‌ఠ‌న‌మూ, మ‌హాచైత‌న్య‌శోభ‌నూ చ‌ల‌న వ‌ర్ణ చిత్రంగా మ‌న ముందుంచారు, ర‌చ‌యిత !

తోలుబొమ్మ‌లాట‌, అదే ఒకానొక జాన‌ప‌ద క‌ళ‌ని గూర్చి విన్న‌వారేగాని చూచిన‌వారు చాలా అరుదు. సంగీత‌, చిత్ర‌క‌ళ‌ల‌కు స‌మ‌ప్రాధాన్యామిస్తూ తోలుబొమ్మ‌లాట క‌ళ గురించి కూడా వివరిస్తూ వ్రాసిన క‌థ‌, బొమ్మాల రాణి అక్ష‌ర‌గంధం లేనివానికి పురాణ‌క‌థ‌ల‌ను గాధ‌ల‌ను వివ‌రించేందుకు ఒక మార్గం ఈక‌ళ‌. వారికి అర్థ‌మ‌య్యే భాష‌తో, వారికిర్ధ‌మ‌య్యే రాగ‌చ్ఛాయ‌ల‌లో పాట‌లు పాడ‌టం, మోటుహాస్యం ఇదంతా తు.చ‌, త‌ప్ప‌కుండా వ‌ర్ణింప‌బ‌డింది. వీరిలోనూ పండితులుండ‌వ‌చ్చు, వీరిలోనూ గాత్ర‌మాధుర్య ఉండ‌వ‌చ్చున‌న్న‌దే ఈ క‌థ ముఖ్యోద్ధేశం. అయిన‌ప్ప‌టికి కులాంత‌ర వివాహం ఉపాంగంగా తీసికోబ‌డింది.

తోలుబొమ్మ‌లును ఒక కుటీర‌ప‌రిశ్ర‌మ అన‌వ‌చ్చు. బొమ్మ‌లు వాళ్లే త‌యారుచేసికొన‌డం, సంగీతం పాడ‌టం ప్ర‌క్క‌వాద్యాలు వాయించుకోడం,బొమ్మ‌ల‌ను తెర‌పై ఆడించ‌డం , అన్నీఇంచుమించుగా ఒక కుటుంబంవారే చేయ‌గ‌ల‌రు. ఇందులో పెద్ద‌వాడు విద్వాంసుడు అవ‌డం కూడా ప‌రిపాటి. రామాయ‌ణ‌, భాగ‌వ‌తాల‌లోని ర‌సవ‌ద్ఘ‌ట్టాల‌ను ఆడి జ‌నాన్ని రంజింప‌చేయ‌డంలో నేర్పును వారంత‌ట‌వారే సంపాదించుకొంటారు. సామాన్య ప్ర‌జ‌ల‌ను ఆంజ‌నేయుల‌వారి కుప్పిగంతులూ, రాక్ష‌సుల పెడ‌బొబ్బ‌లూ, ఎక్కువ ఆక‌ర్షిస్తాయి. అంచేత రామాయ‌ణం వీరిచేత అధికంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది. వీరి భాష‌కూడా కొంచెం న‌వ్వు పుట్టించేదిగానే ఉంటుంది. హ‌నుమంతా ఎందుకు నాకు ఆ సుగ్రీవుడు క‌న‌బడుతున్న వాడ‌వుకుంటూ ఉండ‌వేదేమోయీ అన్న సంభాష‌ణ‌లు.

ఈక‌ళ జాన‌ప‌దుల వినోదానికి ఏర్ప‌డింది అవ‌డం చేత‌సాధార‌ణంగా శ్రామికులు నిర‌క్ష‌రాస్యులు మాత్ర‌మే ఎక్కువ‌గా వ‌స్తారు. కానీ ఈ తోలుబొమ్మ‌లాట ఆడే వారి గుంపు గొప్ప‌విద్వుత్తుగ‌ల‌ది. అందుక‌ని సంగీత శాస్త్ర‌జ్ఞులు, సంస్కారులు, నాగ‌రికులు, పెద్ద ఉద్యోగులు కూడా చూడ‌టానికి వ‌చ్చారు. వీర‌య్య మ‌నుమ‌రాలి కోకిల కంఠం అతి తియ్య‌గా ఉంటుంది. గాత్ర శ‌రీరం గంభీరంగా అల‌వోక‌గా తీగ‌లు సాగుతూ గ‌మ‌కాల‌లో ఒదుగుతూ ప్ర‌కృతి జ‌నిత‌మైన వైచిత్ర‌ము గ‌ల‌ది. సంగీత శాస్త్ర‌వేత్త అయ‌న సీతారామ‌య్య‌ను ఈ బాల‌కంఠం అమితంగా ఆక‌ర్షించింది.

రాత్రిబొమ్మ‌లాట‌, ప‌గ‌లు భిక్షాట‌న ! ఈ పిల్ల ఒక వారం త‌రువాత భిక్షానికి ఊరిలోనికివ‌చ్చి,త‌న గ‌డ‌ప‌ముందు నుంచుని, క‌మ్మ‌గా పాడుతూండ‌గా సీతారామ‌య్య వింటాడు. ఆమెకు సంగీతం నేర్పాల‌నే గాఢ‌కాంక్ష క‌లుగుతుంది. వాళ్ళు వాళ్ళు అందుకు ఒప్ప‌రు. ఆమె లేక‌పోతే త‌మ‌కు ఆదాయం ప‌డిపోతుందంటారు. అయినా ఎంతో ప‌ట్టుద‌ల‌తో ఒప్పించి శ్ర‌మ‌ప‌డి ఆమెను ప్ర‌థ‌మ‌శ్రేణికి చెందిన గాయ‌కురాలిగా చేస్తాడు.

సీతారామ‌య్య చేసిన‌ది గొప్ప తిరుగుబాటు. క‌డ‌జాతి బాల‌, ఆమె ఉన్న‌త కుల‌స్థుడిత‌డు, వారినీడ కూడా సోక‌కూడ‌ద‌నే శ్రోత్రియ బ్రాహ్మ‌ల‌ను లెక్క‌చేయ‌డు. పాఠం చెప్పి పంపేయ‌క‌, త‌న ఇంట్లోనే ఉంచుకొని, త‌మ‌తో ఆమెను క‌లుపుకొని, సంఘంలో త‌లెత్తుకు తిరుగుతాడు. సీతారామ‌య్య భార్య‌కు ఆమె మూడ‌వ కుమార్తె అయింది. సీతారామ‌య్య కూతురు ఆమె క‌ట్టు, బొట్టు మార్చి, న‌వీనాలంక‌ర‌ణ నేర్పి మ‌రింత నాగ‌రీకంగా మీనాక్షిని త‌యారుచేసింది.

ఒక బొమ్మ‌ల‌వాళ్ళ పిల్ల‌ని, అనాగ‌రికురాలిని తెచ్చి నాగ‌రిక‌త‌ను నేర్పారు, వెదురు బొమ్మ‌ను సువాస‌న భ‌రిత‌మైన చంద‌న‌పు బొమ్మ‌గా త‌యారు చేశారు.